News April 12, 2025
జనగామ: నేడు డిగ్రీ కళాశాల బంద్కు పిలుపు

స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా నేడు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల బందుకు పిలుపునిచ్చినట్లు జేఏసీ కన్వీనర్ పిట్టల సురేశ్ వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. స్కాలర్షిప్ బకాయిలు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు, యజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో కౌశిక్, అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 12, 2025
మోతాదుకు మించి ఎరువులు వద్దు

వ్యవసాయంలో నేల, నీరు, విత్తనం తర్వాత ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. అధిక దిగుబడుల కోసం నిపుణుల సూచనలను పక్కనపెట్టి రైతులు ఎక్కువగా ఎరువులను వాడుతున్నారు. దీని వల్ల పెట్టుబడి భారం పెరగడంతో పాటు ఎరువుల వృథా జరుగుతోంది. అధికంగా వేసిన ఎరువులను మొక్కలు పరిమితంగానే వినియోగించుకుంటాయి. మిగిలినవి భూమిలోకి చేరుతాయి. అందుకే వ్యవసాయ అధికారుల సిఫార్సుల మేరకు పంట దశను బట్టి రైతులు ఎరువులను వాడటం మంచిది.
News December 12, 2025
NGKL: జిల్లాలో ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 7 మండలాల పరిధిలో ఉన్న 151 గ్రామ సర్పంచ్, 1,412 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత ఎన్నికలలో అన్ని పార్టీల నాయకులు అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి పోటాపోటీగా తలపడుతున్నారు.
News December 12, 2025
మొదటి విడతలో ఎన్నికల్లో 15 కేసులు: ADB SP

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.


