News April 12, 2025

జనగామ: నేడు డిగ్రీ కళాశాల బంద్‌కు పిలుపు

image

స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరసనగా నేడు జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల బందుకు పిలుపునిచ్చినట్లు జేఏసీ కన్వీనర్ పిట్టల సురేశ్ వెల్లడించారు. వారు మాట్లాడుతూ.. స్కాలర్‌షిప్ బకాయిలు సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు, యజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో కౌశిక్, అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 12, 2026

అనకాపల్లి: యువతిని మోసగించి.. రూ.4 లక్షలు కొట్టేశారు

image

నర్సీపట్నంలో సైబర్ నేరగాళ్లు ఒక యువతని మోసగించి రూ. 4 లక్షలు కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. టౌన్ సీఐ షేక్ గఫూర్ కథనం ప్రకారం.. రామారావుపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని, ఉద్యోగాల కోసం ఇంస్టాగ్రాం శోధిస్తుండగా ఆమెకు ఒక లింక్ వచ్చింది. ప్రోడక్ట్ చూసి వాయిస్ ఓవర్ ఇస్తే రూ. 100 ఇచ్చేవారు. భారీ మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఆమె నుంచి డబ్బులు కొట్టేశారని సీఐ తెలిపారు.

News February 12, 2026

లైఫ్‌లో ఎన్నిసార్లు ప్రేమలో పడతారు..?

image

జీవితంలో ఒక మనిషి సగటున 2సార్లు గాఢంగా ప్రేమిస్తారని కిన్సీ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. 18-99సం.ల మధ్య గల 10వేల మందిపై సర్వే చేయగా.. 14% అసలు పిచ్చి ప్రేమలో పడబోమని, 28% ఒకసారి, 30% రెండు సార్లు, 17% మూడుసార్లు, 11% 4లేదా అంతకంటే ఎక్కువ సార్లు లవ్‌లో మునిగి తేలుతామన్నారట. ప్రేమ, ఆకర్షణకు తేడా గుర్తించక ప్రతి ఫీలింగ్‌నూ లవ్ అనుకుని ఆ రిలేషన్ మొదట్లో పొరబడతారట. ఈ సర్వేలో మీది ఏ బ్యాచ్? కామెంట్.

News February 12, 2026

మా ప్రాజెక్టుల్ని AP ఎందుకు అడ్డుకుంటోంది: రేవంత్

image

TG: ‘పాలమూరు-రంగారెడ్డి’ని AP అడ్డుకోవడంపై CM రేవంత్ అసహనం వ్యక్తంచేశారు. ‘పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసుకోవచ్చని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అడ్డుకుంటున్నారు? మీ ఇష్టమొచ్చినట్లు మీరు చేస్తే మాకు నచ్చినట్లు మేమూ చేస్తాం. గోదావరి జలాల్లో మాకూ 960 TMCల వాటా ఉంది. బేసిన్ అవసరాలు తీరాకే ఇతర బేసిన్లకు నీటిని తరలించాలి. మిగులు జలాల్లో చెరిసగం వాడుకోవచ్చు. చర్చలతో సమస్య తీరుతుంది’ అని CM పేర్కొన్నారు.