News March 20, 2025

జనగామ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకుంటలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.

Similar News

News December 3, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి 29 మంది సీనియర్ రెసిడెంట్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆసుపత్రికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శుభవార్త అందించింది. తాజాగా 29 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించింది. పీజీ పూర్తి చేసిన ఈ నిపుణులైన వైద్యులు, సంవత్సరం పాటు అత్యవసర విభాగాలతో సహా జనరల్ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో సేవలు అందిస్తారు. ఈ నియామకాలతో ఖమ్మం ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానుంది.

News December 3, 2025

హన్మకొండ: 66 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్

image

జిల్లాలో ఈసారి జరగబోయే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి, ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు దశల్లో పోలింగ్ జరగనున్న మొత్తం 1986 పోలింగ్ స్టేషన్లలో (PS) దాదాపు 586 స్టేషన్లను వెబ్ కాస్టింగ్ కోసం ఎంపిక చేశారు.
దశ-I: 166 (658 PS)
దశ-II: 208 PS (694 PS)
దశ-III: 212 PS (634 PS) కేంద్రాల్లో పర్యవేక్షణ కోసం 66 మైక్రో అబ్జర్వర్లను నియమించారు.

News December 3, 2025

PCOSతో దంత సమస్యలు

image

పీసీఓఎస్‌ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్‌టైటిస్‌’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.