News March 18, 2025

జనగామ: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News October 31, 2025

KMR: పత్తి కొనుగోళ్లు వాయిదా..సోమవారం షురూ

image

మద్నూర్ పరిధిలోని 7 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు KMR జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వాయిదా పడిన కొనుగోలు ప్రక్రియ సోమవారం నాడు ప్రారంభం కానుంది. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. శనివారం, ఆదివారం కొనుగోలు ప్రక్రియ జరగదని ఆమె స్పష్టం చేశారు.

News October 31, 2025

పర్యాటకులకు గుడ్ న్యూస్.. విజయవాడ-అరకు డైరెక్ట్ ట్రైన్

image

విజయవాడ మీదుగా అరకు-యలహంక మధ్య స్పెషల్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. NOV 14,18,24,25న యలహంక-అరకు, 13,17,23,24న అరకు-యలహంక మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. పై తేదీలలో యలహంక నుంచి మధ్యాహ్నం 1.30/2 గంటలకు, అరకులో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరతాయన్నారు. మార్గమధ్యంలో రాజమండ్రి, అనకాపల్లి, దువ్వాడ, తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

News October 31, 2025

MBNR: RTC గుడ్ న్యూస్.. ప్రత్యేక టూర్

image

కార్తికమాసం సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ డిపో మేనేజర్ సుజాత Way2Newsతో తెలిపారు. 1.పంచారామాల దర్శిని (3Days)-₹2400, 2.కాకతీయ దర్శిని (2Days)-₹1500, 3.పాలమూరు శైవ క్షేత్ర దర్శిని (2Days)-₹1400, 4.అరుణాచల దర్శిని (3Days)-₹3600, 5.వేములవాడ దర్శిని (2Days)-₹1300లకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయించిందని, వివరాలకు 94411 62588, 99592 26286 సంప్రదించాలన్నారు.