News March 18, 2025
జనగామ: ‘పది’ పరీక్ష పదిలంగా!

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 6,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News April 25, 2025
KMR: ప్రియుడితో కలిసి భర్తను చంపింది

రామారెడ్డి PSలో ఏడాది క్రితం మిస్సైన కేసును పోలీసులు చేధించారు. ASP చైతన్యరెడ్డి వివరాలిలా.. ఇస్సన్నపల్లి వాసి తిరుపతి భార్య మనెవ్వకు లింబయ్యతో అక్రమ సంబంధం ఏర్పడిందని తేలింది. తిరుపతి అడ్డుగా ఉన్నాడని లింబయ్య మరో ఇద్దరితో కలిసి తిరుపతిని మందు తాగుదాం అని చెప్పి డొంకల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
News April 25, 2025
VKB: బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు: అదనపు కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్లో బాల్య వివాహల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహలను నిర్మూలించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ సూచించారు.
News April 25, 2025
గంభీరావుపేట: అనుమానస్పదంగా ఇద్దరు మృతి

అనుమానాస్పద రీతిలో ఇద్దరు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజ సింగవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉల్లి శ్రీకాంత్ తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చెరుకూరి రేఖ అదే ఇంట్లో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.