News March 9, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

image

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమగు ఏర్పాట్లూ ముమ్మరం చేశారు.

Similar News

News November 6, 2025

కొత్తగా బనగానపల్లి రెవెన్యూ డివిజన్?

image

కొత్త జిల్లాలు, డివిజన్ల మార్పుచేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. బనగానపల్లిని కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసే అంశంపై ఉపసంఘం చర్చించింది. మంత్రి BC జనార్దన్‌రెడ్డి ప్రతిపాదన మేరకు ఈ అంశాన్ని పరిశీలించింది. మరోవైపు కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివానం అనే కొత్త మండలం ఏర్పాటుపైనా ఉపసంఘం దృష్టి సారించింది. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.

News November 6, 2025

నేడు స్పీకర్ వద్ద విచారణకు భద్రాచలం MLA

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. BRSలో గెలిచి అధికార కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు సంబంధించి అనర్హత పిటిషన్‌పై విచారణ నేడు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ ఏడాది ఆగస్టు 23న దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. నేడు(గురువారం) జరగబోయే విచారణతో ఎమ్మెల్యే వెంకటరావు రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనని జిల్లాలో చర్చ మొదలైంది.

News November 6, 2025

KNR: ‘పైసలిస్తేనే పని’.. కార్మిక శాఖలో ఓపెన్ దందా..!

image

కార్మిక శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. దళారులు, అధికారులు కలిసి సామాన్యుడిని దోచుకుంటున్నారు. డెత్ క్లైమ్‌కు రూ.50,000, పెళ్లికి రూ.10,000 ముందు చెల్లిస్తేనే ఖాతాల్లో డబ్బు జమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఇందుకు ఏజెంట్లు, బ్రోకర్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి KNR కార్మిక శాఖలో లేబర్ కార్డ్ నమోదు నుంచి వివాహకానుకలు, అంగవైకల్యం, డెత్ క్లైమ్ల వరకు ప్రతిపనికి ఓ RATE ఫిక్స్ అయ్యుంది.