News March 10, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు 41 పరీక్ష కేంద్రాలు

ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు జనగామ జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని అన్ని వసతులున్న పాఠశాలలను కేంద్రాలుగా గుర్తించారు. మరో 11 రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
Similar News
News December 13, 2025
జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.
News December 13, 2025
పాలమూరు: పదవి ఒకరిది.. పెత్తనం మరొకరిది..!

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. రిజర్వేషన్ల కారణంగా అధిక శాతం మహిళలే గెలుపొందారు. ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అనుభవం లేని మహిళలు.. నిరక్షరాస్యులైన కొత్త వాళ్లు వార్డు సభ్యులు, సర్పంచ్‌గా గెలుపొందారు. వీరి పదవి అలంకారప్రాయమైన.. పెత్తనం మాత్రం భర్త, కుమారులది కొనసాగనుంది.
News December 13, 2025
పసుపులో ఆకుమచ్చ తెగులు – నివారణ

ఆకుమచ్చ తెగులు సోకిన పసుపు ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి గోధుమ మచ్చలుగా మారతాయి. తెగులు తీవ్రమైతే ఆకు మాడిపోతుంది. దుంపలు, కొమ్ములు, మొక్కల ఎదుగుదల లోపించి దిగుబడి, నాణ్యత తగ్గుతుంది. ఈ తెగులు కట్టడికి లీటరు నీటికి మాంకోజెట్ 2.5 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లేదా ప్రోపికోనజోల్ 1mlను 0.5ml జిగురుతో కలిపి 15 రోజల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


