News March 24, 2025

జనగామ: పదో తరగతి పరీక్షలకు 90.94% హాజరు

image

జనగామ జిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారి ఎం.రమేష్ తెలిపారు. మొత్తం 41 సెంటర్లలో బాలురు 2,975, బాలికలు 3,231కు మొత్తం 6,206 గాను… బాలురు 2,973, బాలికలు 3,229 హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 90.94% హాజరయ్యారు.

Similar News

News December 10, 2025

ఇండిగో సంక్షోభంపై సిక్కోలు నేతలు మౌనం

image

ఇండిగో సంక్షోభంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఇండిగో సంక్షోభానికి రామ్మోహన్ నాయుడే కారణమని ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాధ్ తదితరులు కేంద్ర మంత్రిపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై జిల్లాలో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు పెద్దగా స్పందించకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతుంది.

News December 10, 2025

విశాఖ: యువతితో సహజీవనం.. కుర్చీతో కొట్టి చంపిన వ్యక్తి అరెస్టు

image

పెందుర్తి పీఎస్ పరిధిలోని సుజాతనగర్లో యువతితో సహజీవనం చేస్తూ తగాదా పడి కుర్చీతో <<18498127>>కొట్టి చంపి పరారైన వ్యక్తిని<<>> పోలీసులు గాలించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు. శ్రీకాకుళానికి చెందిన దేవి, విజయనగరానికి చెందిన శ్రీనివాస్ 6 నెలలుగా సుజాతనగర్లో రూమ్ తీసుకుని సహజీవనం చేస్తున్నారు. డబ్బుల కోసం దేవీతో గొడవపడి చంపాడు. కాగా రైస్ పుల్లింగ్ వంటి పలు నేరాల్లో శ్రీనివాస్‌పై ఇప్పటికే కేసులున్నాయి.

News December 10, 2025

HYD: CM సాబ్.. జర దేఖోనా!

image

నేడు CM రేవంత్‌ OUకు వస్తున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు CM ముందు పలు డిమాండ్లు ప్రస్తావించారు. క్యాంపస్‌కు రూ.1000 కోట్లు, వర్సిటీ భూములను పరిరక్షించాలి, PHD విద్యార్థులకు రూ.20,000, ప్రతి విద్యార్థికి రూ.50,000 ఫెలోషిప్, హాస్టల్‌లోని మెస్‌లలో నాణ్యమైన భోజనం, స్కిల్ సెంటర్ ఏర్పాటు, విద్యార్థి సంఘాలపై నిర్భంధాలు ఎత్తివేయాలి, ఓయూ PSను క్యాంపస్‌ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.