News March 8, 2025
జనగామ: పదో తరగతి విద్యార్థులు సెక్టార్ల వారీగా

జనగామ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 6,238 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో బాలురు 2,996 మంది, 3,242 మంది బాలికలు పరీక్షకు రాయనున్నారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 1,660 మంది పరీక్ష రాయనున్నారు. ఎయిడెడ్ 15, ఆశ్రమ 126, బీసీ వెల్ఫేర్ 356, ప్రభుత్వ 84, జిల్లా పరిషత్ 2,275, కేజీబీవీ 431, ఆదర్శ 91, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల నుంచి 512 మంది పరీక్ష రాయనున్నారు.
Similar News
News November 27, 2025
రాయచోటిలో బస్సులు ఆపి వీరంగం..6 రోజుల జైలు

రాయచోటి టౌన్ బంగ్లా సర్కిల్‌లో శనివారం యువకుడు కళ్యాణ్ ఆర్టీసీ బస్సులను అడ్డగించి డ్రైవర్లతో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. AJFCM కోర్టు రాయచోటిలో ఇన్‌ఛార్జ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ తేజస్విని ఎదుట హాజరుపరచగా ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.
News November 27, 2025
అమరావతిలో ‘మెగా’ ఎయిర్‌పోర్ట్.. మాస్టర్ ప్లాన్ వివరాలివే!

రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 4,618 ఎకరాల్లో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయనున్నారు. 4 కి.మీ పొడవైన రన్‌వేను ఫేజ్-1లో ప్లాన్ చేశారు. ఇది ‘కోడ్-4ఎఫ్’ స్థాయి విమానాశ్రయం. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ A380, బోయింగ్ 777-9 కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చని సమాచారం.
News November 27, 2025
చిత్తూరు: మహిళా ఉద్యోగులకు తప్పని వేధింపులు.!

చిత్తూరులో జిల్లాలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై విలేకరుల మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. వనదుర్గాపురానికి చెందిన ఆర్మీ ఉద్యోగి నవీన్ నాయుడు, విలేకరి శరవణ, HRC సభ్యుడు గురు ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా తనను చిత్రవధ చేస్తున్నారని ఓ మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 5 నెలలుగా వేధిస్తుండగా భర్త అనుమానంతో దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.


