News March 21, 2025

జనగామ: పదో తరగతి విద్యార్థులకు ‘విజయోస్తు’

image

రేపు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న జనగామ జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘విజయోస్తు’ అని గురువారం ఒక ప్రకటనలో ఆశీర్వదించారు. ప్రశాంత మనసుతో పరీక్షను ఎదుర్కోవాలని, చక్కగా రాసి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జిల్లాను నిలబెట్టాలని కోరారు.

Similar News

News January 3, 2026

GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News January 3, 2026

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

image

TG: ఇది పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ‘మరో మూడేళ్లు ప్రతి ఏప్రిల్‌లో విడతల వారీగా అర్హులకు ఇళ్లు ఇస్తాం. గత ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇళ్లు ఇచ్చింది. ఆగిపోయిన ఇళ్లకూ నిధులు కేటాయించాం. గత ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే పంపిణీ చేసింది. మొదటి విడతలోనే చెంచులకు ఇళ్లిచ్చాం’ అని తెలిపారు.

News January 3, 2026

KNR: ఢిల్లీలో మోగనున్న తెలంగాణ ‘ఒగ్గు డోలు’

image

తెలంగాణ మట్టి పరిమళం, పల్లె పదాల గలగలలు మరోసారి దేశ రాజధానిలో ప్రతిధ్వనించనున్నాయి. 2026, JAN 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన ఇచ్చేందుకు జనగామ(D) మాణిక్యాపురం ‘ఒగ్గు డోలు’ బృందం ఎంపికైంది. దివంగత ప్రముఖ కళాకారుడు మిద్దె రాములు వంటి మహనీయులు విశ్వవ్యాప్తం చేసిన ఈ జానపద కళకు జాతీయ వేదికపై గుర్తింపు లభించడం పట్ల KNRజిల్లా ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.