News January 31, 2025
జనగామ: పదో తరగతి విద్యార్థులకు రేపటి నుంచి స్నాక్స్

ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు ఈవెనింగ్ స్నాక్స్ అమలు చేయనుంది. ఇందుకు ఒక్కో విద్యార్థి కోసం రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. పల్లీపట్టి, బిస్కెట్లు, పకోడీ తదితరాలను అందించనున్నారు. జిల్లాలోని 3,068 మంది విద్యార్థులను గాను రూ.17,48,760 నిధులు మంజూరయ్యాయి. వీటిని స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు.
Similar News
News February 13, 2025
NZB: తొమ్మిదిన్నర తులాల బంగారం చోరీ

NZBలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సౌత్ CI సురేశ్ తెలిపారు. అర్సపల్లిలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా షేక్ ఆఫ్తాబ్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆటోనగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసి నగలను అమ్మేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు CI తెలిపారు. నిందితుడు నుంచి తొమ్మిదిన్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, 2 వాచ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News February 13, 2025
సర్వే సిబ్బంది మీ ఇంటికి రాలేదా? ఇలా చేయండి

TG: రాష్ట్రంలో ఇంకా 3.1% మంది కులగణనలో పాల్గొనలేదని భట్టి విక్రమార్క తెలపగా సర్వే సమయంలో తమ ఇంటికి సిబ్బందే రాలేదని చాలామంది చెబుతున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇచ్చే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సిబ్బందే వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని భట్టి స్పష్టం చేశారు. మండల కార్యాలయాల్లో ఈనెల 16-28 మధ్య అందుబాటులో ఉండే అధికారులకు, ఆన్‌లైన్‌లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
News February 13, 2025
మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది: ఎర్రబెల్లి

రానున్న ఆరు నెలల్లో కాంగ్రెస్ కూలిపోతుందని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం పెద్దవంగర మండలంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ బూటకపు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎర్రబెల్లి పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.