News February 1, 2025
జనగామ: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం ధర్దేపల్లి, విస్నూర్, చెన్నూరు పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్ సందర్శించి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నాణ్యతను పరిశీలించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పనులు పూర్తయినట్లు అధికారులు ఫోటోలతో సహా నివేదికలు అందించాలన్నారు.
Similar News
News February 12, 2025
జగిత్యాల జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్!

@యువత గుండె నిబ్బరంతో ఉండాలన్న ధర్మపురి సీఐ @వెల్గటూరులో పురుడు పోసిన 108 సిబ్బంది @వెల్గటూరులో ప్రకృతి వైపరీత్యాలపై విద్యార్థులకు NDRF అవగాహన @మెట్పల్లి వైన్స్‌లో బాటిల్ పై MRP కంటే రూ.30 అదనపు వసూళ్లు @మెట్పల్లి చెర్ల కొండాపూర్‌లో మొరం అక్రమ రవాణా.. స్థానికుల ఆరోపణలు @కొండగట్టులో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్న భక్తుడు
News February 12, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యంశాలు!

@జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన MLC ఎన్నికల ప్రచారం@మహిళ గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించిన అదనపు కలెక్టర్లు, అధికారులు @కరాటే ఛాంపియన్‌షిప్ విద్యార్థులను అభినందించిన జగిత్యాల MLA@కొత్తపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు @ఇబ్రహీంపట్నంలో పరీక్షలపై విద్యార్థులకు MLA సంజయ్ టిప్స్ @రాయికల్‌లో రేపటినుండి భీమన్న జాతర @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 1,63,681 ఆదాయం @కొండగట్టు ఆలయంలో భక్తుల రద్దీ
News February 12, 2025
పెద్దపల్లి: వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసును CBIకి అప్పగించేందుకు ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. తమపై లేని ఆరోపణలు చేసి నిందితులుగా చేర్చారని పుట్ట మధు తరఫు న్యాయవాది కేసు కొట్టివేయాలని కోర్టును కోరారు. కోర్టు కేసును 2 వారాలకు వాయిదా వేసింది.