News April 19, 2024
జనగామ: పరీక్షలో ఫెయిల్ అవుతానని ఆత్మహత్య

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వంశీ అనే యువకుడు<<13076185>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం.. గతేడాది ఇంటర్ పరీక్షల్లో వంశీ ఫెయిలయ్యాడు. ఇటీవల సప్లిమెంటరీ కూడా రాశాడు. అయితే మరోసారి పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి చూడగా మృతి చెంది ఉన్నాడని SI తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI చెప్పారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.
News December 1, 2025
వరంగల్: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.
News November 30, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.


