News April 19, 2024
జనగామ: పరీక్షలో ఫెయిల్ అవుతానని ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో వంశీ అనే యువకుడు<<13076185>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. SI సాయి ప్రసన్నకుమార్ కథనం ప్రకారం.. గతేడాది ఇంటర్ పరీక్షల్లో వంశీ ఫెయిలయ్యాడు. ఇటీవల సప్లిమెంటరీ కూడా రాశాడు. అయితే మరోసారి పరీక్షలో తప్పుతానన్న భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం తల్లి చూడగా మృతి చెంది ఉన్నాడని SI తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు SI చెప్పారు.
Similar News
News September 13, 2024
వరంగల్: ఎట్టకేలకు భారీగా పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పత్తి ధర ఊరటనిచ్చింది. గత నాలుగు నెలలుగా మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు పత్తి అధిక ధర పలికింది. మార్కెట్‌లో సోమ, మంగళవారాలలో క్వింటా పత్తి ధర రూ.7,700 పలకగా బుధవారం రూ.7,800, గురువారం రూ.7,790కి చేరింది. కాగా, నేడు రూ.7,940 ధర రికార్డు స్థాయిలో పలికింది.
News September 13, 2024
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన దీప్తి
ప్యారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించిన పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జివాంజి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంస్య పథకం సాధించిన దీప్తిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.
News September 13, 2024
ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు
వరంగల్లోని ఎనుమాముల మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలెపాక నిర్మల తెలిపారు. ఈనెల 14న శనివారం వారాంతపు యార్డు బందు, 15న ఆదివారం కాగా, 16న సోమవారం వినాయక నిమజ్జనం సందర్భంగా, 17న మంగళవారం మిలాద్ ఉన్ నబీకి సెలవు ఉందన్నారు. తిరిగి 18న మార్కెట్ పున:ప్రారంభం అవుతుందన్నారు.