News March 5, 2025
జనగామ: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

మే 4న జరగనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్-2025 పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం మంగళవారం జిల్లా కేంద్రంలోని గీతాంజలి పబ్లిక్ పాఠశాల, సెయింట్ మేరీస్ పాఠశాల, క్రీస్తుజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలను డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండరి చేతన్ నితిన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. కాగా జిల్లా నుంచి విద్యార్థులు ఈ నీట్ రాయనున్నట్లు తెలిపారు.
Similar News
News February 24, 2026
పోలవరం: పెద్దపులి సంచారం

ఉమ్మడి గోదావరి జిల్లాలో ఇటీవల పెద్దపులి అలజడి సృష్టించడం, అటవీ అధికారులు పులిని బంధించి విశాఖ జూకు తరలించి, తదనంతరం పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టడం తెలిసిందే. అయితే పులిని విడిచిపెట్టి వారం గడవకు ముందే రంప ఏజెన్సీలో జనవాసంలో పులి అలజడి మొదలైంది. సోమవారం పెదగెద్దాడ సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.
News February 24, 2026
రీ-ఓపెన్ అర్జీలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 311, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 176 అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల అసంతృప్తి కారణంగా 283 దరఖాస్తులు రీ-ఓపెన్ అయ్యాయన్నారు. అలాంటి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News February 24, 2026
నంద్యాల: రైతులను తిప్పలు పెడుతున్న పర్ఫాల్ స్వాపెన్ పక్షులు

విదేశీ పక్షులతో నంద్యాల జిల్లాలోని వరి రైతులు బెంబేలెత్తుతున్నారు. రబీ సీజన్‌లో రైతులు వరి నాట్లు విస్తారంగా వేశారు. అయితే పర్ఫాల్ స్వాపెన్ జాతికి చెందిన విదేశీ పక్షులు నాట్లను పీకేస్తూ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పోర్ఫిరియో ఇండికస్, ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చిన ఈ పక్షులు చిత్తడి నేలల్లో జీవిస్తాయి. వరి, జమ్ము బెరడులను తిని బతికే ఈ పక్షులు వరి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు.


