News March 13, 2025
జనగామ: పలు గ్రామాల్లో సైకిల్‌పై పర్యటించిన సీఐ

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని సిరిసన్నగూడెం, వల్మిడి, కూర్మగూడెం, మల్లంపల్లి గ్రామం క్రాస్ రోడ్, కంబాలకుంట తండాలను సీఐ గట్ల మహేందర్ రెడ్డి సందర్శించారు. ఆస్తి నేరాల గురించి అవగాహన, ఆస్తి నేరాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గ్రామాల్లో CC TV నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు వంటి వాటిపై సైకిల్‌పై తిరుగుతూ గ్రామస్థులకు సీఐ అవగాహన కల్పించారు.
Similar News
News April 10, 2026
పోషణ్ పక్వాడ్ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్

అన్నమయ్య జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాలతో ఈనెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, పంచాయితీలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం లోపంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులు ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లో ఐసీడీఎస్‌తో కలసి పోషణ పక్వాడ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, గర్భిణీలు బాలింతల్లో పోషకాహారంపై అవగాహన పెంచాలన్నారు.
News April 10, 2026
గులాబీ గూటికి జీవన్ రెడ్డి.. కండువా కప్పనున్న KCR

TG: సీనియర్ నేత జీవన్ రెడ్డి BRSలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న జగిత్యాలలో BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీలో చేరిక తేదీని కన్ఫర్మ్ చేశారు. ఇక తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పట్టు కోల్పోయిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
News April 10, 2026
సూర్యాపేట: పంట మార్పిడిలో జిల్లా వెనుకంజ

జిల్లాలో పంటల వైవిధ్యం లోపించడంపై వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లాలోని 6.24 లక్షల ఎకరాల సాగు భూమిలో 92.5% కేవలం వరి, పత్తి పంటలే సాగవుతుండటంతో రాష్ట్రంలోనే జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఒకే రకమైన పంటల వల్ల భూసారం తగ్గి, పెట్టుబడి పెరుగుతోందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రైతులు పంట మార్పిడి చేపట్టి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచిస్తున్నారు.


