News September 21, 2024
జనగామ: పీఆర్ పెండింగ్ పనులను పూర్తిచేయాలి: కలెక్టర్

పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అక్టోబర్ 15 కల్లా పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష ఆదేశించారు. జనగామ కలెక్టరేట్లో స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు ఇంజనీరింగ్ అధికారులతో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలన్నారు.
Similar News
News October 25, 2025
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమం కింద రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, భూభారతి దరఖాస్తులపై సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.
News October 25, 2025
ఫోన్ చేసి పిలిపించి… గోదాం తీయించి..!

వర్ధన్నపేట పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తాళం వేసి ఉండటంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫోన్ చేసి రప్పించి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి వర్షిని, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణితో కలిసి గిడ్డంగిని పరిశీలించారు. వారు క్షేత్ర స్థాయిలో స్టాక్ రిజిస్టర్‌ను, గోదాంలోని బియ్యం నిల్వ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివేదికను కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
News October 25, 2025
పర్వతగిరి: గిరాకీ లేదు.. వైన్ షాప్ ఎత్తేయండి..!

తమ పరిధిలోని ఒక వైన్ షాప్‌నకు గిరాకీ లేదని, షాప్ ఎత్తేయాలని ఏకంగా ఎక్సైజ్ అధికారులే ఉన్నతాధికారులకు ప్రతిపాదించారు. అదేంటీ.. వైన్ షాపులకు వాస్తు లేకున్నా గిరాకీ ఫుల్లుగా ఉంటుంది కదా అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ ఇది నిజం. పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామంలో గల వైన్ షాపు టార్గెట్ చేరుకోలేదని షాపును తొలగించారు. దీంతో మండలంలో 6 వైన్ షాపులు ఉండగా.. ప్రస్తుతం ఒకటి తొలగించడంతో ఐదుకు తగ్గింది.


