News August 24, 2024
జనగామ: పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తరిగొప్పుల మండలం జాలూబాయి తండాకు చెందిన సభావత్ సుమన్(26) అదే తండాకు చెందిన ఓ యువతితో మూడు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కలహాలు రాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సుమన్ శుక్రవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేశారు.
Similar News
News January 21, 2026
WGL: ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్‌లలో సీసీ కెమెరాలు అమర్చి బోర్డు సర్వర్‌కు అనుసంధానం చేశారు. పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.
News January 21, 2026
వరంగల్: ‘స్కాలర్‌షిప్ విద్యార్థులు ఆధార్ లింకు చేసుకోవాలి’

జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతాలను వెంటనే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పలత సూచించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను 1356 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోగా, అందులో 872 మంది ఇంకా ఆధార్ లింకింగ్ పూర్తి చేయలేదని వెల్లడించారు.
News January 21, 2026
గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: వరంగల్ కలెక్టర్

జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పని చేసి యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తు పదార్థాలకు అలవాటు పడితే కలిగే నష్టాలపై ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.


