News January 27, 2025
జనగామ: పురపాలిక ప్రత్యేకాధికారిగా పింకేశ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల అదనపు బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జనగామ పురపాలిక ప్రత్యేకాధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్ సోమవారం మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్, పురపాలిక ప్రత్యేకాధికారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందించారు
Similar News
News November 16, 2025
ఫుట్బాల్ రాష్ట్రస్థాయి టోర్నీ.. మెదక్ జట్టుకు తృతీయ స్థానం

పాఠశాల క్రీడా సమాఖ్య(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో నల్గొండలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అండర్-17 ఫుట్బాల్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలుర జట్టు తృతీయ స్థానం సాధించింది. మూడో స్థానం కోసం రంగారెడ్డితో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియగా, పెనాల్టీ షూటౌట్లో మెదక్ జట్టు 4-3 స్కోరు తేడాతో విజయం సాధించిందని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు.
News November 16, 2025
ముందే పంచాయతీ.. ఆ తర్వాతే పరిషత్ ఎన్నికలు?

TG: పరిషత్ ఎన్నికల కంటే ముందుగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 2 విడతలుగా ముందు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోర్టులో కేసు విచారణ ఉండటం, అటు 15 ఫైనాన్స్ నిధులు ఆగిపోవడంతో ముందు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది.
News November 16, 2025
చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.


