News February 26, 2025

జనగామ: పోలీస్ ఎస్కార్ట్‌తో పరీక్ష పేపర్లను తరలించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బషా షేక్ 10వ తరగతి పరీక్షలపై సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు తాగునీరు, మూత్రశాలల సౌకర్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రభుత్వ వాహనంలో పరీక్ష పేపర్లను తరలించాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 9, 2025

పిల్లలు మొండిగా చేస్తున్నారా?

image

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.

News December 9, 2025

జగిత్యాలలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఈరోజు కనిష్ఠంగా కథలాపూర్, మన్నెగూడెంలో 9.1℃, రాఘవపేట 9.3, ఐలాపూర్ 9.4, గుల్లకోట 9.5, మల్లాపూర్ 9.5, మేడిపల్లి, పేగడపల్లి, నేరెళ్ల 9.6, గోవిందారం 9.7, రాయికల్, జగ్గాసాగర్ 9.8, పూడూర్, బుద్దేశ్‌పల్లి 9.9, అల్లీపూర్లో 10.0℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.