News January 27, 2025

జనగామ: ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదు: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించరాదని జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు.

Similar News

News September 14, 2025

నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 227.2 మి.మి వర్షపాతం నమోదైంది. మండలాల వారిగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ మండలంలో అత్యధికంగా 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, పెంబిలో 25.8, కుంటాల 25.6, మామాడ 19.6, దస్తురాబాద్ 17.2, భైంసా 16.4, సారంగాపూర్ 15.6, దిలావర్పూర్, నిర్మల్ రూరల్ మండలంలో 14.2 మి.మీ వర్షపాతం నమోదుయింది.

News September 14, 2025

కలెక్షన్లలో దుమ్మురేపుతోన్న ‘మిరాయ్’

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం రెండు రోజులకు వరల్డ్ వైడ్‌గా ₹55.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. పాజిటివ్ టాక్ రావడం, వీకెండ్ కూడా కావడంతో వసూళ్లు ఇంకా పెరుగుతాయని వారు భావిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు.

News September 14, 2025

సెప్టెంబర్ 17 నుంచి స్వస్త్ నారీ-సశక్త్ పరివార్: కలెక్టర్

image

జనగామ జిల్లాలో స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమమని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సాధికారత కోసం శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ చేయనున్నట్లు వివరించారు. ANC తనిఖీలు చేపట్టి రోగనిరోధక శక్తిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1న మెగా రక్తదానం కూడా జరుగుతుందన్నారు.