News April 4, 2025
జనగామ: ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలి: MLA

అడవులను నాశనం చేస్తూ మూగజీవాలపై బుల్డోజర్లను పంపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కేవలం HCU సమస్య కాదని యావత్ తెలంగాణ సమస్యని ఆయన అన్నారు. అడవులు నాశనం అవుతుంటే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఏటికేడు ఎండలు మండుతున్నాయని, వర్షాలు సకాలంలో కురవట్లేదని భవిష్యత్తులో ఆక్సిజన్ కొనాలని ఆయన మండిపడ్డారు.
Similar News
News April 5, 2025
మహాముత్తారం మండలంలో అకాల వర్షం.. అపార నష్టం

భూపాలపల్లి జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కురిసిన వర్షాలతో మహాముత్తారం మండలంలోని సింగారం, రేగులగూడెం, బోర్లగూడెం, మీనాజిపేట, నర్సింగాపూర్ గ్రామాల్లో మిర్చి, వరి రైతులకు తీరని నష్టం జరిగింది. చేతికందే దిశలో ఉన్న వరి నేలవాలడంతో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయారు. మిర్చి పంటకు ధర లేదని, తడిసిన మిర్చికి ధర రాదని ఆవేదన వ్యక్తం చేశారు.
News April 5, 2025
తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌పై కోచ్ ఏమన్నారంటే?

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయం చర్చనీయాంశమైన వేళ కోచ్ జయవర్దనే స్పందించారు. ‘సూర్య ఔట్ అయినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్ రన్స్ చేస్తాడని చివరి ఓవర్ల వరకు వేచి చూశాం. కానీ, అతను బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు కొత్త బ్యాటర్ అవసరమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అది వ్యూహాత్మక నిర్ణయం’ అని అన్నారు.
News April 5, 2025
ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 23 వరకు అక్కడే ఉంటారు. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఆయనతో పాటు, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొననున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన ఉండనుంది.