News March 7, 2025
జనగామ: ప్రశాతంగా మూడో రోజు ఇంటర్ పరీక్షలు

జనగామ జిల్లాలో నేడు (శుక్రవారం) నిర్వహించిన ఇంటర్మీడియట్ జనరల్, వొకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 186 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. మొత్తం 4,355 విద్యార్థులకు గాను 4,169 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. డీఐఈవో, స్క్వాడ్ బృందం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
Similar News
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.
News December 2, 2025
తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకం

తల్లీకొడుకూ, తండ్రీకూతుళ్ల బంధాల గురించే అందరూ ప్రస్తావిస్తారు. కానీ తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, అవగాహన, కూతురు పెరిగే క్రమంలో స్వేచ్ఛగా పంచుకున్న ఆలోచనలు, భావాలు, అనుభవాలతోపాటు హార్మోన్లు దీనికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాల్ని నియంత్రించే మెదడు నిర్మాణం ఇద్దరిలో ఒకేలా ఉండటమూ ఈ బలమైన బంధానికి ఓ కారణమట.
News December 2, 2025
వరంగల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 124 కేసులు నమోదు

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సోమవారం చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మొత్తం 124 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలో 94, వెస్ట్ జోన్లో 6, ఈస్ట్ జోన్లో 2, సెంట్రల్ జోన్లో 22 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.


