News March 7, 2025
జనగామ: ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్

పోస్టల్ శాఖ పెన్షనర్ల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అదాలత్ నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జనరల్ పోస్టుమాస్టర్ తెలిపారు. శుక్రవారం తపాలా శాఖ పరిధిలోని పోస్టల్ పెన్షనర్ల ఫిర్యాదులపై మార్చి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంబంధిత ఫిర్యాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తామన్నారు.
Similar News
News December 27, 2025
బొకేలు వద్దు.. పేద విద్యార్థులకు ‘చేయూత’ ఇవ్వండి: కలెక్టర్

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపే వారు, ఆ ఖర్చును సంక్షేమ హాస్టల్ విద్యార్థుల కోసం వెచ్చించాలని జిల్లా కలెక్టర్ షామ్మోహన్ కోరారు. జిల్లాలోని 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో చదువుతున్న 15వేల మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, దోమతెరలు లేదా ఇతర వసతుల కల్పనకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆడంబరాలకు బదులు పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
News December 27, 2025
ఈనెల 29న సిద్దిపేట కలెక్టరేట్లో ప్రజావాణి: కలెక్టర్

ఈ నెల 29న సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్జీదారులు నేరుగా వచ్చి తమ వినతులను సమర్పించవచ్చని ఆమె పేర్కొన్నారు.
News December 27, 2025
గంజాయి అక్రమ రవాణాపై KNR సీపీ స్పెషల్ ఫోకస్

కరీంనగర్ కమిషనరేట్లో 2025 సంవత్సరంలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ 6 కేసుల్లో 25 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి 29.042kg గంజాయి, రూ.6,44,150, ఆరు మోటార్ సైకిల్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు 9 నమోదు కాగా 12 మంది అరెస్టయ్యారు. రూ.5,81,280 విలువైన 334 క్వింటాళ్ల బియ్యంతో పాటు 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.


