News March 16, 2025

జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

image

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Similar News

News November 7, 2025

ONGCలో 2,623 అప్రెంటిస్‌ ఖాళీలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో డెడ్‌లైన్ ముగియగా ఈనెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం <>ఇక్కడ<<>> క్లిక్ చేయండి.

News November 7, 2025

పనులు మరింత వేగవంతంగా సాగాలి: హనుమకొండ కలెక్టర్

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి మరింత వేగవంతంగా సాగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ, ఆర్డీఓ, మెప్మా, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి,ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టని లబ్ధిదారుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

News November 7, 2025

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

image

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.