News February 4, 2025
జనగామ: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 100 రోజుల ఉచిత శిక్షణ

ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్.ఎంపీవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 9తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.
Similar News
News December 18, 2025
తూ.గో: ముచ్చటగా మూడు పదవులు

తబ.గో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరికి ముచ్చటగా 3 పదవులు వరించాయి. రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, రుడా ఛైర్మన్‌గా ఉన్న ఆయనకు ఇప్పుడు కొత్తగా జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. 3 పదవుల ముచ్చట మూన్నాళ్లకే పరిమితం అవుతుందా ? కొనసాగిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. రుడా ఛైర్మన్ పదవిని వేరొకరికి కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
News December 18, 2025
పెద్దపల్లి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతం: వీర బుచ్చయ్య

PDPL జిల్లాలో గ్రామ పంచాయతీల 2వ సాధారణ ఎన్నికలు మూడు దశలో ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని అదనపు జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తెలిపారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ, రెవెన్యూ, జడ్పీ, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, నోడల్ అధికారులు, పంచాయతీ సిబ్బంది, మీడియా కీలక పాత్ర పోషించాయన్నారు. అందరి సమన్వయం, అంకితభావమే ప్రక్రియ విజయానికి కారణమని అన్నారు.
News December 18, 2025
పెంచికల్‌పేట్ శివారులో పులి సంచారం..!

కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్- బుర్రకాయలపల్లి మధ్య పొలం మార్గంలో పులి సంచారం జరిగిందన్న సమాచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, రేంజ్ ఆఫీసర్ కొమురయ్య యాపల వాగు సమీపంలో పులి ఆనవాళ్ల కోసం పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. పరిశీలనలో స్థానిక నాయకుడు పల్లె నారాయణ, గ్రామస్థులు పాల్గొన్నారు.


