News February 4, 2025

జనగామ: బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 100 రోజుల ఉచిత శిక్షణ

image

ఆర్.ఆర్.బి, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 100 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్.ఎంపీవీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అర్హులైన విద్యార్థులు www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 9తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.

Similar News

News February 16, 2025

సిద్దిపేట: నేడు కొమురవెల్లి మల్లన్న ఐదో వారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో ఆదివారం (నేడు) ఉత్సవాలకు సుమారు 50 వేల మంది భక్తులు తరలి రానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు మల్లన్నకు బోనాలు సమర్పిస్తారు. మండపం వద్ద గంగిరేగు చెట్టు ఆవరణ, బసచేసే గదుల వద్ద పట్నాలు వేయనున్నారు. మల్లన్న గుట్టపైన ఎల్లమ్మకు బోనాలు సమర్పిస్తారు.

News February 16, 2025

సంతమాగులూరు: పునాదులు తీస్తుండగా బయటపడ్డ విగ్రహం

image

సంతమాగులూరులో మాజీ సర్పంచ్ జమ్ముల నాగరాజు కుటుంబీకులు శనివారం నూతన ఇల్లు నిర్మించుకునేందుకు ఇంటి పునాదులు తీస్తుండగా పురాతన పోతురాజు విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని గమనించిన జమ్ముల కుటుంబీకులు పరిసర నివాసాల వారు విగ్రహాన్ని కడిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ విగ్రహాన్ని వేద పండితుల సలహా మేరకు స్థానిక శివాలయంలో భద్రపరిచారు.

News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

error: Content is protected !!