News April 4, 2025

జనగామ: మాయదారి వానలు.. అప్పులే గతి!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రస్తుతం పంటలన్నీ చివరి దశకు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో వర్షం పడితే అప్పులే దిక్కు అని ఓరుగల్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తిలో మొక్కజొన్న, వరి చివరిదశకు చేరుకోగా.. తొర్రూరు, కొత్తగూడతో పాటు పలుప్రాంతాల్లో పంటకోసి కుప్పనూర్చారు. ఇప్పుడు ఈదురు గాలులతో వర్షం పడితే పంట నేలకు ఒరిగే అవకాశముంది. వర్షం ఎప్పుడు పడుతుందోనని ఆందోళన పడుతున్నారు.

Similar News

News April 22, 2025

గొప్ప మనసు చాటుకున్న జగ్గారెడ్డి

image

క్యాన్సర్ బాధితురాలికి జగ్గారెడ్డి అండ‌గా నిలిచారు. సదాశివపేటకు చెందిన ఆమని ఇంటికి వెళ్లిన ఆయన బాధితురాలిని పరామర్శించారు. చికిత్సకు రూ.7 లక్షల అప్పులు చేశానని.. భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని ఆమని విలపించింది. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని వాపోయింది. బాధితురాలి గాథ విని జగ్గారెడ్డి తక్షణమే రూ.10 లక్షలు అందించారు.

News April 22, 2025

తాళ్లపూడి: పుష్కరాల రేవులో శిశువు మృతదేహం లభ్యం

image

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పుష్కరాల స్నాన ఘట్టానికి వెళ్లే మార్గంలో ఆడ శిశువు మృతదేహాన్ని మంగళవారం స్థానికులు కనుగొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొవ్వూరు సీఐ విజయబాబు ప్రాంతాన్ని సందర్శించి శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు మృతదేహం లభ్యమవ్వడంతో చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో పోలీసులు విచారణ చేపట్టారు.

News April 22, 2025

కడప జిల్లాలో ఎస్ఐల బదిలీ

image

కడప జిల్లా వ్యాప్తంగా పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిపాదనల మేరకు 10 మందికి స్థానచలనం కల్పించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేసుకోవాలని సూచించారు. 

error: Content is protected !!