News August 17, 2024

జనగామ: మున్సిపల్ రెవెన్యూ పెంచేందుకు కృషిచేయాలి: కలెక్టర్

image

జనగామ మున్సిపల్ రెవెన్యూ పెంచేందుకు అధికారులు ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు, ట్రేడ్ లైసెన్స్, ప్రచార హోర్డింగ్స్ అనుమతులు, భవన నిర్మాణ అనుమతులు, రెంటల్ ఛార్జిస్, జరిమానాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటూ ఆదాయం పెంచాలన్నారు. వసూళ్లలో జాప్యం చేయొద్దన్నారు.

Similar News

News September 20, 2024

BREAKING.. వరంగల్ రైల్వే స్టేషన్లో NO STOP

image

వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద 39 రైళ్లకు SEP 25 నుంచి 28 వరకు నో స్టాప్ వర్తిస్తుందని HYD సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. హసన్‌పర్తి, కాజీపేట, వరంగల్, విజయవాడ-వరంగల్ మార్గంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు ట్రైన్లకు కాజీపేట ఆల్టర్నేటివ్ స్టాప్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరికొన్ని ట్రైన్లను డైవర్ట్ చేశారు.

News September 20, 2024

వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి: అదనపు ఎస్పీ

image

MHBD జిల్లా పరిధిలోని సబ్ డివిజన్‌కు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను అడిషనల్ ఎస్పీ చెన్నయ్య జిల్లా పోలీస్ కార్యాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు వాహనాలను నిరంతరంగా ప్రజాసేవలకు వినియోగించాల్సి ఉన్నందున ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లను ఆదేశించారు.

News September 20, 2024

కాంగ్రెస్ ప్రభుత్వానికి అవమానం: ‘X’లో KTR

image

వరంగల్ <<14142693>>MGMలో అంబులెన్స్<<>> అందుబాటులో లేకపోవడం అమానుషమని మాజీ మంత్రి KTR అన్నారు. గురువారం జ్వరంతో మృతి చెందిన గీతిక(6)ను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడంపై ఆయన ‘X’లో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అవమానం అన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ ఆసుపత్రులను మరణ ఉచ్చులుగా మార్చడమే గాక.. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కూడా అధ్వానంగా ఉందన్నారు. ఇది కాంగ్రెస్, CM రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమని మండిపడ్డారు.