News April 7, 2025

జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

image

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.

Similar News

News October 18, 2025

పెద్దపల్లి: ఈనెల 22న జాబ్ మేళా

image

పెద్దపల్లి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ రూమ్ నం. 225లో జాబ్ మేళా ఉంటుందని ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఓ ప్రైవేటు ఇండస్ట్రీస్‌లో మిషన్ ఆపరేటర్, సూపర్వైజర్, క్లర్క్ వంటి 14 ఖాళీలు ఉన్నాయన్నారు. 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు సర్టిఫికేట్లతో హాజరుకావాలన్నారు.

News October 18, 2025

HYD: ఆటోవాలాకు ‘దీపావళి పండుగ’

image

బీసీల 42% రిజర్వేషన్‌ బిల్లుపై హైకోర్టు స్టే విధించడంతో అన్ని పార్టీలు ఏకకంఠంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ చక్రాలు ఆగిపోయాయి. బస్టాప్‌లు ఆటోలతో కిక్కిరిశాయి. పాఠశాలలు మూతపడి, ఉద్యోగాలు కొనసాగడంతో ఆటోల డిమాండ్‌ ఆకాశాన్నంటింది. ప్రయాణికులు డబుల్‌ ఛార్జీకి ఒప్పుకోవాల్సి వచ్చింది. అకస్మాత్తుగా పడిన ఈ అదృష్టంతో ఆటోవాలకు ముందుగానే ‘దీపావళి’ వెలుగొచ్చిందని సంబరపడుతున్నారు.