News January 10, 2026

జనగామ: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

జనగాం-సూర్యాపేట జాతీయ రహదారిపై లింగాల గణపురం మండలం నవాబుపేట వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన దరిపల్లి నరసింహులు, వనపర్తి శివారు మర్రితండాకు చెందిన మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. అదే తండాకు చెందిన మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 23, 2026

కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: బండి సంజయ్

image

TG: కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా ఆ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలున్నా KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

News January 23, 2026

కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

image

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.

News January 23, 2026

ఆదిలాబాద్: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రమేశ్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు tsstudycircle.co.in వెబ్‌సైట్ లేదా 9494149416 సంప్రదించవచ్చు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.