News January 31, 2025
జనగామ: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రహదారి భద్రతపై జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Similar News
News December 18, 2025
NGKL: రేషన్ కార్డుదారులు e-KYC చేసుకోండి

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని రేషన్ కార్డు దారులు జాతీయ ఆహార భద్రత పథకం(NFSA) కింద 100% ఈ కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం జిల్లాలో 8,80,058 లబ్ధిదారులకు గాను 6,28,315 లబ్ధిదారులు మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేయగా 2,51,743 లబ్ధిదారులు ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. కేవైసీ పూర్తికాని పక్షంలో రేషన్ పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
News December 18, 2025
కడప జిల్లాలో లక్ష్యానికి దూరంగా AMCల రాబడి

కడప జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి 2025-26లో రూ.13.53 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. నవంబర్ చివరి నాటికి రూ.7.09 కోట్లు (52.44%) మాత్రమే వసూలైంది (రూ.కోట్లలో). కడప – 1.54, ప్రొద్దుటూరు – 0.71, బద్వేల్ – 1.20, జమ్మలమడుగు – 0.42, పులివెందుల – 0.67, మైదుకూరు – 1.44, కమలాపురం – 0.44, సిద్దవటం – 0.13, ఎర్రగుంట్ల – 0.38, సింహాద్రిపురం – 0.12 మాత్రమే వసూలైంది.
News December 18, 2025
ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.


