News January 31, 2025

జనగామ: రహదారి భద్రత నియమాలను పాటించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రహదారి భద్రతపై జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రతా ప్రమాణాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Similar News

News February 9, 2025

డ్రామాలో బుడాన్ ఖాన్ కేసీఆర్: ఎంపీ రఘునందన్

image

డ్రామాలో బుడాన్ ఖాన్ కథ లెక్క కేసీఆర్ తీరు ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్‌లో పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడారు. బీజేపీ బలపర్చిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులున్నారు.

News February 9, 2025

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

image

మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడారు. అమిత్ షాను కలిసిన అనంతరం బీరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ భళ్లాకు పంపారు. కాగా బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు నిన్న కాంగ్రెస్ ప్రకటించింది. ఈలోపే ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

News February 9, 2025

ఆగిన ఫ్లడ్ లైట్లు.. మ్యాచ్ నిలిపివేత

image

భారత్-ఇంగ్లండ్ రెండో వన్డేకు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ జోరు మీదున్న టైంలో స్టేడియంలో ఫ్లడ్ లైట్లు ఆగిపోయాయి. వెలుతురు లేక అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ఇరు జట్ల ప్లేయర్లు మైదానాన్ని వీడారు. దీంతో ప్రేక్షకులు సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి సందడి చేస్తున్నారు.

error: Content is protected !!