News March 21, 2025
జనగామ: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: రవీందర్

రాజీవ్ యువ వికాసం పథకానికి నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి రవీందర్ తెలిపారు. రాష్ట్రంలో వెనకబడిన తరగతుల కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు వరం అని, స్వయం ఉపాధి కల్పించి తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పధకం ప్రకటించిందన్నారు. https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News February 24, 2026
నువ్వుల పంటలో రసం పీల్చే పురుగులు – నివారణ

నువ్వుల పంటను పేనుబంక, పచ్చదోమ, తెల్లనల్లి, తామర పురుగులు ఆశించి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీలుస్తాయి. ఫలితంగా ఆకులు వాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. పేనుబంక, తామరపురుగు, పచ్చదోమ నివారణకు KG విత్తనానికి 5గ్రా. ఇమిడాక్లోఫ్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. లీటరు నీటికి డైమిథోయేట్ 1.6ml లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేయాలి. తెల్లనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml కలిపి పిచికారీ చేయాలి.
News February 24, 2026
శ్రీకాకుళం: బంగారం చోరీ చేసిన విద్యార్థులు

శ్రీకాకుళంలోని ఎల్బీఎస్ కాలనీకి చెందిన ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. నగరంలో ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంట్లో చొరబడి 2తులాల బంగారం, రూ. 4వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా వన్ టౌన్ సీఐ పైడాపునాయుడు వారిని పట్టుకున్నారు. విద్యార్థులు మైనర్లు కావడంతో తల్లితండ్రులు అభ్యర్థన మేరకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
News February 24, 2026
కలుపు తీయనివాడు కోత కోయడు

సాగులో ప్రధాన పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. రైతులు సరైన సమయంలో కలుపును తొలగించకపోతే, అది ప్రధాన పంటకు చేరాల్సిన పోషకాలను లాగేసుకొని పంట సరిగా పెరగదు. నిర్లక్ష్యం చేస్తే రైతుకు కోసేందుకు పంట కూడా మిగలదు. అలాగే నిజ జీవితంలో కూడా ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దారిలో ఎదురయ్యే ఆటంకాలను (కలుపును) ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఈ సామెత తెలియజేస్తుంది.


