News March 7, 2025
జనగామ: రామచంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించిన అదనపు కలెక్టర్

చరిత్రలో పేరుగాంచిన చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం మరణించిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేశ్ కుమార్, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీవో వెంకన్న, పాలకుర్తి తహశీల్దార్ శ్రీనివాస్ పాలకుర్తిలో నివాసం ఉంటున్న వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
Similar News
News September 18, 2025
VKB: క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి: VC

తెలుగు వర్శిటీలోని బాచుపల్లి ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాలలో అధ్యాపకులకు అధ్యాపకేతురులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యఅతిథిగా ఉపకులపతి(VC) ఆచార్య నిత్యానందరావు హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటడం ద్వారా భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్, వర్శిటీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
News September 17, 2025
16 ఏళ్ల నాటి పోరాటం గుర్తుచేసుకున్న MLC కవిత

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, 2009లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన తెలంగాణ విలీన దినోత్సవం వేడుకల జ్ఞాపకాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ‘X’ ఖాతాలో పంచుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న రోజులవి. ఆనాటి పోరాట స్ఫూర్తిని, యువతలో ఉన్న ఉత్సాహాన్ని మరోసారి ఆమె గుర్తుచేశారు.
News September 17, 2025
మరో 3 గంటలు భారీ వర్షం.. జాగ్రత్త!

TG: హైదరాబాద్లో <<17744168>>వర్షం<<>> దంచికొడుతోంది. మరో 3 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అటు రాబోయే 2-3 గంటల్లో ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, యాదాద్రి, NZB, సూర్యాపేట, HNK, మేడ్చల్, ఉమ్మడి మెదక్ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.