News April 7, 2025
జనగామ: రాముడి ఆస్తి ఎక్కడ?.. వెలిసిన ఫ్లెక్సీ

స్టేషన్ ఘనపూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఆదివారం రాములవారి కళ్యాణం ఘనంగా జరగగా.. రాముడి ఆస్తి ఎక్కడ? అంటూ ఆలయ ఆవరణలో స్థానికుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. గ్రామంలో దేవుడి పేరుపై 86.35 ఎకరాల భూమి ఉండగా.. సుమారు పదిమంది వ్యక్తులు 50 ఎకరాల వరకు భూమిని పట్టా చేయించుకున్నట్లు తెలిసిందన్నారు. రాముని ఆస్తి తిరిగి వస్తుందనే ఆశతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశానన్నాడు.
Similar News
News April 25, 2025
మొదటి సిక్స్ ప్యాక్ ఎవరిది?.. హీరోల మధ్య వివాదం

తొలి సిక్స్ ప్యాక్ ఎవరిదన్న విషయంపై తమిళనాట హీరోల మధ్య వివాదం నెలకొంది. ఇండస్ట్రీలో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసింది సూర్య అని ఆయన తండ్రి శివకుమార్ ఓ కార్యక్రమంలో అన్నారు. అతడిలా ఎవరూ కష్టపడలేరని కామెంట్ చేశారు. దీనిపై విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘అందరికంటే ముందుగా సిక్స్ ప్యాక్ చేసింది ధనుష్. ఆ తర్వాత ‘సత్యం’ కోసం నేను చేశాను’ అని గుర్తుచేశారు. ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
News April 25, 2025
నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు.
News April 25, 2025
భూ సమస్యల సత్వర పరిష్కారానికే భూ భారతి: SRPT కలెక్టర్

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మునగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు.