News March 30, 2025
జనగామ: రైతాంగాన్ని ఆదుకోవాలని కలెక్టర్కు వినతి

జిల్లాలోని సాగు నీరు అందక పంట ఎండిపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా నాయకులు శనివారం కలెక్టర్ రిజ్వాన్ భాషాకు వినతిపత్రం అందజేశారు. ప్రతి రైతుకు 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శివరాజ్ యాదవ్, దేవరాయ ఎల్లయ్య, హరిచంద్రగుప్త, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 5, 2025
నల్గొండ: హంగు లేదు.. ఆర్భాటమూ లేదు!

గత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే రోజున ప్రధాన పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులు భారీ ర్యాలీ తీసి, డప్పుచప్పుళ్లతో జనసమీకరణ చేసి నామినేషన్ దాఖలు చేసేవారు. అదే సందడి పోలింగ్ ముగిసే వరకు కొనసాగించే
వారు. ఈసారి ఎన్నికల్లో అభ్యర్థులు హంగు, ఆర్భాటం లేకుండా నామినేషన్ దాఖలు చేయడం, గుట్టచప్పుడు కాకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
News December 5, 2025
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.
News December 5, 2025
బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


