News February 2, 2025
జనగామ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ధూలిమిట్ట మండలం కూటిగల్ గ్రామం రెడ్యా నాయక్ తండాకు చెందిన ధరావత్ విజయ్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 24, 2025
KNR: డిసెంబర్ 1 నుంచి 6 వరకు డి.ఎల్.ఇడి పరీక్షలు: డీఈఓ

కరీంనగర్ జిల్లాలోని డి.ఎల్.ఇడి. (D.El.Ed.) ప్రథమ సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహించబడతాయని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఎస్. మొండయ్య తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండు పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ సూచించారు.
News November 24, 2025
HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.
News November 24, 2025
అన్నదాతల సాధికారతకు రైతన్నా మీకోసం: కలెక్టర్

అన్నదాతల సాధికారతే లక్ష్యంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక సాధనకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని వివరించారు.


