News January 22, 2025
జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
శ్రీకాకుళం: ఘోర ప్రమాదం..నలుగురు మృతి

కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద హైవేపై ఆదివారం వేకువజామున ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భోరోసింగ్ పవర్ (60), విజయ్ సింగ్ తోమర్ (65), ఉషీర్ సింగ్ (62), సంతోషి భాయ్ (62), డెడ్ బాడీలు కోటబొమ్మాళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు.కోటబొమ్మాళి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి కేసు నమోదు చేశారు.
News November 23, 2025
MNCL: కొడుకుపై గొడ్డలితో దాడి చేసిన తండ్రి అరెస్ట్

డబ్బుల కోసం కొడుకుపై దాడి చేసిన తండ్రిని అరెస్ట్ చేసినట్లు రెబ్బెన పోలీసులు తెలిపారు. కిషన్ జీతం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న తండ్రి శంకర్ నాయక్ శుక్రవారం భోజనం చేస్తున్న కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో కిషన్ తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శనివారం శంకర్ నాయక్ను అరెస్ట్ చేశారు.
News November 23, 2025
నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.


