News January 22, 2025
జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 17, 2026
ఫోన్ పోయిందా అయితే ఇలా చేయండి: VZM ఎస్పీ

మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనం జరిగినా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి లేదా ఆన్‌లైన్‌లో CEIR పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ సోమవారం తెలిపారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసి మొబైల్ ట్రాకింగ్ చర్యలు చేపట్టవచ్చని చెప్పారు. ప్రజలు తమ మొబైల్ IMEI నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.
News March 17, 2026
NGKL: పర్యావరణ పరిరక్షణ.. 4 గ్రామాల తరలింపు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్రాబాద్(M) వటువర్లపల్లితో పాటు మరో 4 గ్రామాలను మైదాన ప్రాంతానికి తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని పన్న వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ తరలింపు కొనసాగుతోంది. కొత్త గ్రామాల ఏర్పాటుకు, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, MLA వంశీకృష్ణ, మాజీ డీఎఫ్‌ఓ రోహిత్ గోపిడికి రీలొకేషన్ కమిటీ అధ్యక్షుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News March 17, 2026
భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.


