News March 20, 2025
జనగామ: వందశాతం పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్ మీద మున్సిపల్ కమిషనర్, ఆర్వో, బిల్ కలెక్టర్, వార్డ్ ఆఫీసర్స్లతో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి బుధవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూరుశాతం ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యంగా మున్సిపల్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పని చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News November 15, 2025
నిజామాబాద్: తెలంగాణ జాగృతిలోకి చేరికలు

నిజామాబాద్లో బీఆర్ఎస్ నుంచి తెలంగాణ జాగృతిలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శనివారం నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పుండ్ర నరేష్ రెడ్డి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో జాగృతిలోకి చేరారు. ఆయన మాట్లాడుతూ.. జనంబాట కార్యక్రమానికి ఆకర్షితులై జాగృతిలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జాగృతి అడ్ హక్ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
News November 15, 2025
96 లక్షల ఫాలోవర్లు.. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి

బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ అభ్యర్థి, యూట్యూబర్ మనీశ్ కశ్యప్ పోటీ చేసి ఓడిపోయారు. చన్పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ గెలుపొందారు. యూట్యూబ్లో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మనీశ్కు 37,172 ఓట్లు రాగా 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడారు. తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో అప్పట్లో అతడిని TN పోలీసులు అరెస్టు చేశారు.
News November 15, 2025
NZB: 17న జరిగే పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయండి

ఈనెల 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న పెన్షనర్ల మహా ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు కోరారు. శనివారం వారు 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్ల బకాయిల సత్వర చెల్లింపులు డిమాండ్ చేస్తూ జేఏసీ పిలుపు మేరకు జరిపే ధర్నా కరపత్రాలు విడుదల చేసి మాట్లాడారు. శ్రీధర్, నర్సింహస్వామి, బన్సీలాల్ పాల్గొన్నారు.


