News February 9, 2025
జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.
Similar News
News October 14, 2025
L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.
News October 14, 2025
గోదావరిఖని: ‘రుణాలు మంజూరు చేసి సహకరించాలి’

స్వశక్తి సంఘాలకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని రామగుండం ఇన్ఛార్జి కమిషనర్ జే.అరుణశ్రీ అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం టీఎల్బీసీ సమావేశం జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను మొదటి, 2వ, 3వ విడతలు సకాలంలో మంజూరు చేయాలని ఆమె కోరారు.
News October 14, 2025
మంథని: L మడుగులో పడి ఒకరు మృతి

మంథని మండలం ఖాన్సాయిపేటకు చెందిన గావిడి సూర్యం ఎల్ మడుగులో పడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రైతు జక్కుల కిషన్ పొలానికి సంబంధించి మోటార్ చెడిపోయింది. దీంతో ఎల్ మడుగులో నుంచి దానిని బయటకు తీసేందుకు గ్రామానికి చెందిన సూర్యం మరో వ్యక్తి గురిసింగా రాజుతో కలిసి అక్కడకు వెళ్లాడు. మోటార్ బయటకు తీసే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు సూర్యం ఎల్ మడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు.