News February 9, 2025

జనగామ: వసతి గృహాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ రైల్వే ట్రాక్ పరిధిలో గల ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, రాత్రి అక్కడే బస చేయనున్నారు.

Similar News

News February 17, 2026

నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

image

అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పదోన్నతుల సందడి నెలకొంది. నలుగురు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా (AO) పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ ఉత్తర్వులు ఇచ్చారు. పి.రాజశేఖర్ (తనకల్లు), బి.మహేశ్ (గోరంట్ల), వైకే నరేంద్ర రెడ్డి (గాండ్లపెంట), సి.పద్మ ప్రియ (రొద్దం) మండలాలకు నియమితులయ్యారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఛైర్‌పర్సన్ వారికి సూచించారు.

News February 17, 2026

ఎవరికి ఏ హెయిర్ స్టైల్ అంటే?

image

ట్రెండ్ అయ్యే ప్రతి హెయిర్ స్టైల్ అందరికీ సెట్ కాదంటున్నారు నిపుణులు. ఫేస్ షేప్‌ని బట్టి హెయిర్ స్టైల్ ఎంచుకోవాలంటున్నారు. రౌండ్, స్క్వేర్ ఫేస్ షేప్ ఉన్నవారికి బ్యాంగ్స్ బావుంటాయి. జుట్టు కెరటాల్లా అందంగా కనిపించాలంటే లాంగ్ కర్టెన్ బ్యాంగ్స్ చేయించుకోవాలి. రౌండ్ షేప్ ఫేస్ ఉన్నవారికి ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్ బావుంటాయి. దీంతో జుట్టు ఒత్తుగా కనిపించడంతో పాటు అన్ని డ్రెస్సుల మీదకీ సెట్ అవుతుంది.

News February 17, 2026

HYD: పెళ్లైంది సరే.. ఆ ‘డబుల్ డ్యూటీ’ సంగతేంటి?

image

‘ఆఫీసులో ఫైళ్లు.. ఇంట్లో గిన్నెలు.. ఈ నరకం ఎన్నాళ్లు’.. కొత్తగా పెళ్లైన ఐటీ ఉద్యోగినుల ఆవేదన ఇది. సమానత్వం అని మాటల్లో చెబుతున్నా ఇంటి బాధ్యతలు మాత్రం ఇంకా ఆడవారికే అప్పజెప్పుతున్నారు. అత్తమామల నిఘా, ఇంటి పనుల భారం భరించలేక ఆఫీసునే ఒక ‘సేఫ్ జోన్’గా భావిస్తున్నారు. అందుకే ఇంటికి త్వరగా వెళ్లడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పని ఒత్తిడి కంటే ఈ ‘రోల్ ఓవర్‌లోడ్’ యువతను ఇంటికి దూరం చేస్తోంది.