News April 5, 2025

జనగామ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జనగామ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 18, 2025

విజయవాడలో శవమై తేలిన భూపాలపల్లి మహిళ

image

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మహిళ విజయవాడలో శవమై తేలింది. KU ఎస్సై శ్రీకాంత్ వివరాలు.. భావుసింగ్‌పల్లి గ్రామానికి చెందిన స్రవంతి కుటుంబంతో కొంత కాలంగా HNK భీమారంలో ఉంటోంది. అయితే పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత రెండు నెలల క్రితం ఆమెకు బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈనెల 15న ఇంట్లోంచి వెళ్లిపోయన స్రవంతి గురువారం విజయవాడ ప్రకాశం బ్యారేజీ(ఏపీ) వద్ద శవమై తేలింది.

News April 18, 2025

పిట్లం: చెరువుకట్ట వద్ద విగతజీవిగా కానిస్టేబుల్

image

పిట్లం మండలం సిద్దాపూర్ చెరువు కట్ట వద్ద శుక్రవారం ఉదయం ఓ కానిస్టేబుల్ విగతజీవిగా కనిపించాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏస్ఐ రాజు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, పిట్లం పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్యగా గుర్తించారు. కాగా బుచ్చయ్య మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

News April 18, 2025

WGL: ఖుష్ మహల్ ప్రత్యేకత తెలుసా..?

image

ఓరుగల్లులోని చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో ఖిలా వరంగల్ ఒకటి. ఇక్కడ చూసేందుకు అనేక ప్రదేశాలు ఉన్నప్పటికీ ఖుష్ మహల్ ప్రత్యేకం. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఖుష్ మహల్ తుగ్లక్ పాలన కాలంలో నిర్మించారు. ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఢిల్లీలోని ఘియాత్ అల్ దిన్ తుగ్లక్ సమాధి, ఖుష్ మహల్ మధ్య నిర్మాణ సారూప్యత ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ కట్టడాన్ని చూశారా.. కామెంట్ చేయండి.

error: Content is protected !!