News March 8, 2025

జనగామ: వికసిత భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ల ఆవిష్కరణ

image

వికసిత భారత్ యూత్ పార్లమెంట్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను జనగామ జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్ శుక్రవారం ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు అనగాని శ్రీనివాస్, నవీనరాణి, శ్రీదేవి పాల్గొన్నారు.

Similar News

News December 12, 2025

ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

image

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్‌, ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002 వంటివి ఆమె చేపట్టారు.

News December 12, 2025

పోలీస్ సిబ్బంది వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత: SP

image

SP వకుల్ జిందాల్ ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది నుంచి నేరుగా వినతులను స్వీకరించిన SP, సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శాఖాపరమైన కేసుల్లో విచారణ అనంతరం సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు. నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ, సిబ్బందికి అనువైన వాతావరణం కల్పనకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

News December 12, 2025

తారస్థాయికి కూటమి అరాచక పాలన: అనిల్‌

image

AP: పోలీసులను అడ్డుపెట్టుకుని TDP రాజకీయాలు చేస్తోందని మాజీమంత్రి అనిల్ కుమార్ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ‘కూటమి ప్రభుత్వ అరాచక పాలన తారస్థాయికి చేరింది. మంత్రి నారాయణ దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. మా పార్టీతో సంబంధంలేని మేయర్‌పై అవిశ్వాసం పెట్టి YSRCPపై ట్రోల్స్ చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉండి.. సంఖ్యా బలమున్నా క్యాంపు రాజకీయాలు చేస్తోంది’ అని విమర్శించారు.