News February 1, 2025

జనగామ: విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ

image

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో పదవ తరగతి గణితం విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించుకొని గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

Similar News

News November 14, 2025

ఛైర్మన్ హోదాలో నేనే పర్యవేక్షిస్తా: సీఎం చంద్రబాబు

image

9 జిల్లాలతో కూడిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అథారిటీకి ఛైర్మన్ హోదాలో తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఏపీని నిర్దేశించే మోడల్ అని అన్నారు. ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్‌ను నీతిఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో కలిసి విడుదల చేశారు. విశాఖ-శ్రీకాకుళం కారిడార్‌ను నౌకా నిర్మాణ హబ్‌గా, భోగాపురం విమానాశ్రయం పరిధిలో ఏరో సిటీని అభివృద్ధి చేస్తామన్నారు.

News November 14, 2025

విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ్టి ఎగ్జామ్ వాయిదా

image

AP: రాష్ట్రంలోని యాజమాన్య స్కూళ్లలో ఇవాళ నిర్వహించే <<18204293>>సమ్మెటివ్-1<<>> పరీక్ష వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. బాలల దినోత్సవం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 1-5 తరగతులకు సంబంధించిన ఎగ్జామ్ ను ఈ నెల 17న, 6-10 తరగతులకు సంబంధించిన పరీక్షను తిరిగి ఈ నెల 20న నిర్వహిస్తామని వెల్లడించింది.

News November 14, 2025

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.