News February 1, 2025

జనగామ: విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్ ఆవిష్కరణ

image

జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలనే ఆశయంతో పదవ తరగతి గణితం విజయోస్తు స్మార్ట్ లెర్నింగ్ మెటీరియల్‌ను శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ స్టడీ మెటీరియల్‌ను ఉపయోగించుకొని గణితంలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. అలాగే జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కోరారు.

Similar News

News July 6, 2025

జగిత్యాల :రేపటితో ముగియనున్న పీరీల పండుగ

image

జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో 11 రోజుల పాటు పెద్దపులి వేషధారణలతో జరుపుకున్న పీరీల పండుగ రేపటితో ముగియనుంది. నిన్న చిన్న సర్గత్తి పురస్కరించుకొని భక్తులు మట్కిలు తీసి మొక్కులు సమర్పించుకున్నారు. రేపు పెద్ద సర్గత్తి కావడంతో వేడుకలు అంబరాన్నంటనున్నాయి. రేపు తొలి ఏకాదశి కావడంతో పలు మండలాల్లో సోమవారం మొహర్రం పండుగ నిర్వహించనున్నారు.

News July 6, 2025

తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

image

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్‌తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News July 5, 2025

54 ఏళ్ల తర్వాత..

image

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత మోగిస్తున్నారు. 54 ఏళ్ల తర్వాత ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచారు. 1971లో వెస్టిండీస్‌పై సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా గిల్ తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. అటు ఒకే టెస్టులో రెండు శతకాలు చేసిన 3వ భారత కెప్టెన్ అతడు. ఇక WTCలో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్(9) తర్వాతి స్థానంలో గిల్(8) ఉన్నారు.