News March 7, 2025

జనగామ: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Similar News

News March 9, 2025

MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News March 9, 2025

ఎమ్మెల్సీ రేసులో అద్దంకి..!

image

TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటాలు చేసిన అద్దంకి రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించగా సామేలుకు కేటాయించడంతో నిరాశే ఎదురైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ అవకాశం దక్కలేదు. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తుండగా అద్దంకికి అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

News March 9, 2025

ఎన్టీఆర్: హోళీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు 

image

హోళీ పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా మాల్డా టౌన్(MLDT), చర్లపల్లి(CHZ) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 18న MLDT- CHZ(నం.03430), ఈనెల 20న CHZ- MLDT(నం.03429) ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు శ్రీకాకుళం రోడ్, విజయనగరం, దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, గుంటూరుతో పాటు ఇతర స్టేషన్లలో ఆగుతాయని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

error: Content is protected !!