News June 24, 2024
జనగామ: వివాహేతర సంబంధం.. ఆపై హత్య
వివాహేతర సంబంధం పెట్టుకొని ఆపై మహిళను హత్య చేసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. సుబేదారి CI వివరాల ప్రకారం.. స్టే.ఘ వాసి మంజులకు, HNK వాసి అశోక్‌తో పెళ్లైంది. కాగా వీరి మధ్య గొడవలు రావడంతో సర్దిచెప్పడానికి వచ్చిన పంచాయితీ పెద్ద మనిషి వెంకటస్వామి ఆమెను లొంగదీసుకొని 2ఏళ్లగా సహజీవనం చేస్తున్నాడు. ఈనెల 21న మంజుల, వెంకటస్వామి ఫోన్‌లో గొడవ పడ్డారు. దీంతో ఆమెను హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
Similar News
News November 9, 2024
ఎండిపోయాక మాత్రమే వరి కోతలు చేపట్టాలి: వరంగల్ కలెక్టర్
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వరి కోత యంత్రం యజమానులతో కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు పండించిన పంట పూర్తిగా వరి నారుమల్లు ఎండిపోయాక మాత్రమే వరి కోతలు చేపట్టాలని హర్వెస్టర్లకు సూచించారు. మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులతో మండలాల వారీగా రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు.
News November 8, 2024
వరంగల్ మార్కెట్లలో పెరిగిన మిర్చి ధరలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లలో నేడు తేజ మిర్చి ధర పెరిగింది. గురువారం క్వింటాకు రూ.16,200 ధర రాగా.. నేడు రూ. 17,000 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు నిన్న రూ.15 వేల ధర రాగా నేడు రూ. 14,500కి పడిపోయింది. మరోవైపు వండర్ హాట్ మిర్చికి నిన్న రూ.14,000 ధర రాగా, ఈరోజు రూ.500 పెరిగి రూ.14,500కి చేరిందని వ్యాపారులు తెలిపారు.
News November 8, 2024
రైతుల అభిప్రాయాలను నివేదికల్లో సమర్పించాలి: వరంగల్ కలెక్టర్
మామూనూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి భూసేకరణలో భాగంగా రైతులతో అభిప్రాయ సేకరణలో భాగంగా గుంటూరుపల్లి, గాడిపల్లి, నక్కలపల్లి రైతులు భూమి కోల్పోయిన రైతుల అభిప్రాయాలను స్వీకరించాలన్నారు. వారి సలహాలు, సూచనల మేరకు నివేదికలు సమర్పించాలని తహశీల్దార్ నాగేశ్వర్‌ను ఆదేశించారు.