News March 8, 2025
జనగామ: విషాదం.. ఆశా కార్యకర్త మృతి

జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం నిడిగొండలోని ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త చీటకోడూర్ మహేశ్వరి హార్ట్ స్ట్రోక్‌తో శుక్రవారం మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వృత్తిపరంగా గ్రామంలోని ప్రజలందరి మన్ననలు పొందిన ఆమె మృతిపై గ్రామస్థులు బాధాతప్త హృదయంతో నివాళులర్పించారు.
Similar News
News November 20, 2025
ఈ ఉద్యమమే టెక్ శంకర్‌ను మావోయిస్టుగా మార్చింది

మావోయిస్ట్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో స్వగ్రామం వజ్రపుకొత్తూరు(M)బాతుపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1988లోని పీపుల్స్ ఉద్యమంతో మావోయిస్టుల పార్టీలో చేరి 1995 DEC 1న ఒంగోలు మాజీ MP సుబ్బరామిరెడ్డిపై కాల్పుల కేసులో శంకర్‌ది కీలక పాత్రని సమాచారం. బాతుపురంలో స్తూపం ఆవిష్కరణకు గద్దర్ రాకతో రాష్ట్రంలో ఈయన పేరు మార్మోగింది.
News November 20, 2025
తిరుపతి: బ్లాక్ మనీని వైట్‌గా మార్చారు ఇలా..!

మద్యం స్కాం డబ్బులతోనే చెవిరెడ్డి కుటుంబం స్థలాలు కొనిందని.. వాటిని జప్తు చేయాలని ACB కోర్టులో సిట్ పిటిషన్ వేయనుంది. 2021 నుంచి 2023 వరకు చెవిరెడ్డి కుటుంబం రూ.63.72 కోట్ల విలువైన స్థిరాస్థులు కొనిందంట. రికార్డుల్లో రూ.8.85కోట్లుగానే చూపించి 54.87 కోట్లు వైట్ మనీగా మార్చారని సిట్ తన దర్యాప్తులో తేల్చిందంట. వడమాలపేట, తిరుపతి, తొట్టంబేడు, కేవీబీపురం, గూడూరు మండలాల్లో ఈ స్థలాలు కొనుగోలు చేశారు.
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


